ETV Bharat / state

రెచ్చిపోయిన దోపిడీ దొంగలు... 14 ఇళ్లలో చోరీ

తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటూ.. చోరీలకు పాల్పడుతున్న దొంగలముఠా.. పోలీసులకు సవాల్​ విసురుతోంది. 14 ఇళ్లల్లో జరిపిన దొంగతనాల్లో మొత్తం 350 గ్రాముల బంగారం, ఐదున్నర లక్షల రూపాయల నగదు దోచుకెళ్లినట్టు స్థానికులు పేర్కొన్నారు. ఈ దొంగతనాలు అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం పరిధిలో జరిగాయి.

Thieves committing thefts in Madakashira constituency of Anantapur district
రెచ్చిపోయిన దోపిడి దొంగలు... 14 ఇళ్లలో చోరీ...
author img

By

Published : Jan 25, 2021, 6:05 AM IST

నెల క్రితం అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని నాలుగిళ్లలో జరిగిన చోరీలను మరవకముందే.. శనివారం జరిగిన దొంగతనాలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రొళ్ళ, అగళి మండలాల్లోని రత్నగిరి, దొడ్డేరి, కాకి, పి.బ్యాడిగెర గ్రామాల్లో తాళాలు వేసిన 14 ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు.

తాళాలు పగలగొట్టి.. బీరువాలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. మొత్తం 14 గ్రామాల్లో 350 గ్రాముల బంగారం, ఐదున్నర లక్షల రూపాయల నగదును దోచుకెళ్లినట్టు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించారు. భద్రత పెంచాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

పొలాల్లో దొరికిన మయూరం.. అటవీ అధికారులకు అప్పగింత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.