ETV Bharat / state

మేలురకం బియ్యం పేరిట.. నూకలు విక్రయం..

author img

By

Published : Feb 22, 2021, 4:43 PM IST

మేలు బియ్యం పేరిట మోసం జరిగిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది. శాంపిల్స్​గా నాణ్యమైన బియ్యం చూపించి.. నూకలని విక్రయిస్తున్నారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు. దీంతో ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

thiefs  rice scam at Uravakonda
నూకలు విక్రయించి మోసం

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో మేలు రకం బియ్యం పేరిట మోసం జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సోనా మసూరి బియ్యం పేరుతో.. నూకలను అంటగట్టారు. దాంతో ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానికంగా నివాసంఉండే సాధు విక్రమ్​కు కొందరు వ్యక్తులు..మేలురకం బియ్యం ఉన్నాయని శాంపిల్స్ చూపించారు. మంచి నాణ్యత ఉండడం వల్ల రూ.3600కి క్వింటాల్ చొప్పున మూడు క్వింటాళ్లను సాధు విక్రమ్ కొనుగోలు చేశాడు.

కొద్దిసేపటి తర్వాత ఒక బస్తా తెరిచి చూడగా.. మొత్తం నూకలు కనిపించాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. ఆయనతో పాటు మరి కొంతమంది మోసపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: వాలంటీర్​ వ్యవస్థను తీసేయాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.