అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని న్యూసిపిఐ కాలనీలో మహమ్మద్ అనే వ్యక్తి గత కొంత కాలంగా కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పనిమీద భార్యాభర్తలిద్దరూ కలిసి తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు తాళాలు పగలగొట్టి నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.25 వేల నగదు చోరీ చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: హార్లీడేవిడ్సన్పై స్వారీ..గుర్రంపై సవారీ.. ఖజనా ఉద్యోగి విలాసం....!