అనంతపురంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలు, తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనానికి పాల్పడుతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను చంపడానికి కూడా దొంగలు వెనుకడుగు వేయడం లేదు. జిల్లాలోని కొవ్వూరునగర్లోని ఓ ఇంటిలో ఉన్న వృద్ధురాలిని తాళ్లతో కట్టేసి... దాదాపు 13 తులాల బంగారం, రూ.1.50వేల నగదును దొంగలు దోచుకెళ్లారని... ఒక్కతే ఉండడాన్ని గమనించిన దుండగులు అర్ధరాత్రి ఇంటి వెనుక వైపు నుంచి వచ్చి ఆమెను తాళ్లతో కట్టివేయటంతో సృహ తప్పి పడిపోయానని చెబుతోంది. దీనిపై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
గతంలోనూ నగర శివారులోని టీవీ టవర్ సమీపంలో దొంగలు చోరీ చేయడానికి ప్రయత్నించారని, ఒంటరిగా ఉన్న మహిళలను దుండగులు చంపేశారు. పోలీసులు ఈ ఘటనపై త్వరగా స్పందించాల్సిన అవసరం ఉందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: