అనంతపురం జిల్లా హిందూపురం మండలంలోని వినాయక్‌నగర్‌కు చెందిన గొపి(45) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఆరు నెలల కిందట అతన్ని వదిలి వెళ్లింది. పలుమార్లు భార్యను కాపురానికి రమ్మన్నా రాకపోవటంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు హిందూపురం రూరల్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి