అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం జరిగింది. స్థానిక రెవెన్యూ కాలనీలో ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సొంత ఇంటి నిర్మాణంలో భాగంగా సాయంకాలం గోడలకు నీళ్లు పడుతుండగా చేతికి విద్యుత్ షాక్ తగిలింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ప్రశాంత్‌ను.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడు ఎంకాం పూర్తి చేసి ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ప్రశాంత్ మృతితో స్నేహితులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఇదీ చూడండి..