అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దొడ్డగట్ట గ్రామస్థులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రహదారుల ప్రమాదాల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. ఆర్ అండ్ బి.. అధికారుల ఉదాసీన వైఖరితో ప్రమాద సూచికలు పెట్టడంలో విఫలం అయిందని ఆరోపించారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు కనీస చర్యలు చేపట్టటం లేదని వాపోయారు. తరుచూ ప్రమాదాలు జరగడంతో ఆగ్రహించిన గ్రామస్థులు... రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సమస్యను పరిష్కరిస్తామని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు చెప్పగా ఆందోళన విరమించారు.
ఇదీ చదవండీ...రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నిరసన