ETV Bharat / state

బాలుడి కిడ్నాప్... రెండు గంటల్లో నిందితుడి అరెస్టు

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో మూడేళ్ల బాలుడు భవిత్ చౌదరి అపహరణకు గురయ్యాడు. రెండు గంటల వ్యవధిలోనే బాలుడి ఆచూకీని కనిపెట్టిన పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేశారు.

The boy's kidnapping ... was found within two hours
బాలుడి కిడ్నాప్...రెండు గంటల్లో ఆచూకీ లభ్యం
author img

By

Published : Feb 18, 2020, 11:48 PM IST

బాలుణ్ని అపహరించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో అపహరణకు గురైన భవిత్ చౌదరి అనే మూడేళ్ల బాలుడి ఆచూకీని రెండు గంటల వ్యవధిలోనే పోలీసులు కనిపెట్టారు. బాలుణ్ని అపహరించిన గంగన్న అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. పట్టణంలోని దుర్గానగర్​కు చెందిన ప్రశాంతి మధుసూదన్ వారి మూడేళ్ల కుమారుడు భవిత చౌదరితో కలిసి మార్కెట్​కు వెళ్లారు. తల్లి దండ్రుల నుంచి బాలుడు పక్కకు వెళ్లగా బాలుణ్ని గంగన్న అనే వ్యక్తి అపహరించాడు. బాలుడి అపహరణపై తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిందితుణ్ని అరెస్ట్ చేసి బాలుణ్ని తల్లిదండ్రులకు అప్పగించారు. గంగన్నకు కుమారులు లేకపోవటం వల్లే భవిత్ చౌదరిని అపహరించాడని డీఎస్పీ తెలిపారు.

ఇదీ చూడండి:

విద్యార్థి ప్రాణం తీసిన చాక్లెట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.