అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆర్జా ఉక్కు కర్మాగారం సహకారంతో ఏర్పాటు చేస్తున్న 500 ఆక్సిజన్ పడకల ఆసుపత్రి మరికొద్ది రోజుల్లో అందుబాటులో రానుంది. ప్రతి పడకకు పైప్ లైన్ ద్వారా ప్రాణవాయువు సరఫరా చేసేలా జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఆసుపత్రిని రూపొందిస్తున్నారు. ఇప్పటికే రోగులు, వారి బంధువుల కోసం మౌలిక సదుపాయాలన్నీ సమకూర్చిన ప్రభుత్వం, రెండు రోజుల క్రితం ఆక్సిజన్ని పైపుల ద్వారా విడుదల చేసి ట్రయల్ రన్ చేసింది. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైపుల ద్వారా ఆక్సిజన్ అందలేదు. దీంతో చిన్నపాటి మార్పులతో మరమ్మతులు చేయాలని ఇంజనీర్లు చెప్పటంతో ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ జర్మన్ హ్యాంగర్ కొవిడ్ ఆసుపత్రి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం డ్రోన్ విజువల్స్ విడుదల చేసింది. జర్మన్ హ్యాంగర్ ప్రత్యేకతను కలెక్టర్ గంధం చంద్రుడు వివరించారు.
ఇదీ చదవండీ… Vijayawada Loco Shed: కొవిడ్ బాధితులకు.. విజయవాడ రైల్వే లోకో షెడ్ సాయం!