అనంతపురం జిల్లాలో ఒక్కటి కూడా బ్లాక్ ఫంగస్(Black Fungus) కేసు లేదని.. అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా ఫంగస్ లేదని తేలిందని కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. 60 మంది బ్లాక్ ఫంగస్(Black Fungus) అనుమానిత లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించగా… అందరికీ నెగిటివ్ వచ్చిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు ఆసుపత్రుల్లో డీఆర్డీవో సహకారంతో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలోనే తొలి ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను హిందూపురంలో ప్రారంభించినట్లు చెప్పారు. కరోనా వైరస్ వ్యాక్సినేషన్ విషయంలో అత్యంత ప్రభావ వంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో వయల్‌ను పది మందికి వేయాల్సి ఉండగా … మందు వృథా కాకుండా సమర్థ నిర్వహణతో 106 శాతం వినియోగిస్తున్నామన్నారు. కేరళ రాష్ట్రంలోని నర్సింగ్ సిబ్బంది కంటే అనంతపురం జిల్లా నర్సింగ్ స్టాఫ్ వ్యాక్సినేషన్ విషయంలో సమర్థంగా పనిచేస్తున్నారన్నారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ 24 శాతంగా ఉందన్నారు. గతంలో అత్యధికంగా ఉన్న 37 శాతం 13 శాతం మేర తగ్గిందని కలెక్టర్ వివరించారు.
ఇదీ చూడండి.: Lock Down: ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారా.. అయితే ఈ పని చేయాల్సిందే!