జలాశయంలో ఈతకు వెళ్లి కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన యువకుడు మృతి చెందాడు. మరణించిన యువకుడు సునీల్ (17)గా స్థానికులు గుర్తించారు. పీఏబీఆర్ జలాశయం వద్దనున్న తన బంధువులు ఇంటికి వచ్చాడు. అనంతరం సరదాగా ఈతకు కొట్టేందుకు జలాశయం లోకి దిగాడు.
లోతు ఎక్కువ ఉండటంతో గల్లంతయ్యాడు. స్థానికులు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు రోజుల పాటు పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం మృతదేహం లభ్యమైంది. యువకుని మృతదేహం చూసి తల్లిదండ్రులు చేసిన రోదనలు స్థానికులను కలచివేశాయి.
ఇదీ చదవండి: