తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ మనుగడ ఉంటుందని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు అన్నారు. నారా లోకేశ్ జిల్లా పర్యటన చేస్తుంటే వైకాపా నాయకులు విమర్శించిన తీరుని ఖండించారు. అనంతపురంలో మాట్లాడుతూ.. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అండగా ఉంటూ వారికి ధైర్యం చెప్తుంటే.. వైకాపా నాయకులు విమర్శించడం సరికాదన్నారు. తెదేపా ఉనికిని కాపాడుకోవడం కోసం పర్యటనలు చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విమర్శలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవుపలికారు.
ఇవీ చదవండి...
పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదే: తులసిరెడ్డి