పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా హిందూపురంలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. కరోనాతో కష్టాలు పడుతున్న ప్రజలపై.. ప్రభుత్వం మరింత భారం మోపిందని విమర్శించారు.
పెంచిన కరెంట్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. డివిజినల్ ఇంజినీర్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: