'చెరువులు నింపండి.. సాగుకు నీరు అందించండి' - హిందూపురం చెరువుల తాజా న్యూస్
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో సాగునీరు అందించాలంటూ రాచపల్లి ప్రధాన రహదారిపై తెదేపా ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. హంద్రీనీవా కాలువ ద్వారా చెరువులకు నీరు అందించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్తామని చెప్పారు. చెరువులకు నీరు తెచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వగా.. ఆందోళన విరమించారు.
హిందూపురం చెరువులకు సాగునీరు అందించాలంటూ తెదేపా ఆధ్వర్యంలో నిరసన