రెండు రోజుల పాటు తెదేపా నిర్వహించిన మహానాడు వేడుకలు విజయవంతమైనట్లు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఈ నెల 27, 28 తేదీలలో కాలవ శ్రీనివాసులు అధ్యక్షతన మహానాడు వేడుకలు నిర్వహించారు.
మహానాడులో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై కాలవ శ్రీనివాసులు తీర్మానం ప్రవేశపెట్టగా తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ నాయకులు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. డిజిటల్ మహానాడు ఆలోచన అభినందనీయమని కాలవ అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ వల్ల వేడుకలు నిర్వహణకు డిజిటల్ ప్లాట్ఫాం వేదికైందన్నారు. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు మహానాడు వేడుకలలో పాల్గొన్నారని కాల్వ తెలిపారు.
ఇదీ చదవండి : లోపాలు సరిదిద్దుకుందాం.... యువశక్తితో కదులుదాం...