అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో వాలంటీర్ కిరణ్ ఎస్టీ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్బవతిని చేసి మోసం చేయడమే కాక, ఆ యువతి కుటుంబంపై దాడి చేయడాన్ని తెదేపా ఇన్చార్జ్ బండారు శ్రావణి తీవ్రంగా ఖండించారు. వాలంటీర్ కిరణ్ పై దిశ చట్టం కింద నమోదు చేయకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు.
పెళ్లిళ్లకు హాజరైన తెదేపా నేతలపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసిన ప్రభుత్వం… మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిపై ఎందుకు కేసులు నమోదు చేయటం లేదని ప్రశ్నించారు. నిందితునిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత యువతికి న్యాయం చేయాలని కోరారు.