అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం తహశీల్దార్ కార్యాలయం ఎదుట కురబ సంఘం ఆధ్వర్యంలో తెదేపా నేతలు ధర్నా చేశారు. మండలంలోని వెంకటాపురంలో తెదేపా నేత కురుబ నాగరాజు ఇంటి చుట్టూ వైకాపా శ్రేణులు బండలు పాతడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దౌర్జన్యాలు ఎక్కువయ్యాయన్నారు. అలాంటివారిపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని వాపోయారు. వెంటనే ఇంటి ముందు బండలు తొలగించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి..