ETV Bharat / state

TDP Leader Valmiki Priyanka: తెదేపా నాయకురాలు వాల్మీకి ప్రియాంక ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా తెదేపా మహిళా నాయకురాలు వాల్మీకి ప్రియాంక(TDP Leader Valmiki Priyanka suicide attempt ).. పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనికి పోలీసుల వేధింపులే కారణమని ప్రియాంక భర్త శ్రీధర్ ఆరోపించారు.

tdp leader Priyanka suicide attempt
అనంతపురం జిల్లా తేదేపా మహిళ జిల్లా కార్యదర్శి ప్రియాంక
author img

By

Published : Nov 26, 2021, 1:09 AM IST

TDP leader Priyanka suicide attempt: అనంతపురం జిల్లా తేదేపా మహిళ జిల్లా కార్యదర్శి వాల్మీకి ప్రియాంక.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆమెకు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసుల బెదిరింపు భరించలేకే తన భార్య ఆత్మహత్యకు యత్నించిందని ప్రియాంక భర్త శ్రీధర్ ఆరోపించారు.

4 రోజుల క్రితం చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైకాపా నేతలు చేసిన ఆరోపణలను మీడియా సమావేశంలో ప్రియాంక ఖండించింది. ఆ సందర్భంగా వైకాపా నేతలపై ప్రియాంక పలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై అనంతపురం 4వ పట్టణ పోలీసులు. ప్రియాంకతోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం కేసు విషయమై దర్యాప్తు పేరుతో మహిళా నాయకురాల ఇళ్లలో సోదాలు చేపట్టారు. 'ప్రియాంక ఇంటిలోనూ ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. అయితే.. 'సోదాల సమయంలో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమే కాక బెదిరింపులకు పాల్పడ్డారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు.. రాత్రి సమయంలో ఇంటి వద్ద తమను బెదిరించారు. పోలీసుల తీరుతోనే తన భార్య ఆత్మహత్యాయత్నం(tdp leader Priyanka suicide attempt at Anantapur) చేసింది అని' శ్రీధర్ పేర్కోన్నారు.

ఇదీ చదవండి..

NIMMAGADDA : "జగన్ అక్రమాస్తుల కేసు నుంచి.. నా పేరు తొలగించండి"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.