ప్రస్తుతం ఉన్న సంస్థకు 108 అంబులెన్సుల నిర్వహణ రద్దుచేసి.. విజయసాయిరెడ్డి అల్లుడి సంస్థకు ఎందుకు ఇచ్చారని తెదేపా నేత ఉమామహేశ్వరనాయుడు ప్రశ్నించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మాట్లాడుతూ.. అంబులెన్సుల విషయంలో వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. పెద్దమొత్తంలో అక్రమాలు జరిగాయని, రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తోందని మండిపడ్డారు. తామెవరం ఇలాంటి వాటికి వెరవమని స్పష్టంచేశారు.
ఇవీ చదవండి.. : 'అనంత'దూరంలో వర్ష జాడ..