ETV Bharat / state

'ఆ ఎమ్మెల్యే తెదేపా కార్పొరేటర్ అభ్యర్థులను బెదిరిస్తున్నారు'

అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై తెదేపా మాజీ శాసనసభ్యుడు ప్రభాకర్ చౌదరి విమర్శలు గుప్పించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తెదేపా కార్పొరేటర్ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

author img

By

Published : Feb 25, 2021, 3:46 PM IST

ex mla
'అనంతపురం ఎమ్మెల్యే.. తెదేపా కార్పొరేటర్ అభ్యర్థులను బెదిరిస్తున్నారు'

అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని తెదేపా కార్పోరేటర్ అభ్యర్థులను బెదిస్తున్నారని... మాజీఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. నగరపాలక సంస్థలో గతంలో ఎప్పుడూ లేని బెదిరింపుల సంప్రదాయం ఈసారి కనిపిస్తోందని విమర్శించారు. నగరపాలక సంస్థలోని పలు డివిజన్లలో పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థులు తప్పుకోవాలని బెదిస్తున్నట్లు ఆరోపించారు. అభ్యర్థులను బెదిరించిన ఫోన్ సంభాషణను త్వరలో మీడియాకు విడుదల చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే అనంత పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.

ఇదీ చదవండి: కనేకల్ మేజర్ పంచాయతీ సర్పంచ్​గా నిర్మల ప్రమాణ స్వీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.