ETV Bharat / state

'ఏడాదిలో వైకాపా సాధించింది శూన్యం' - Tdp Kadiri Incharge Venkata Prasad latest news

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిలో సాధించింది శూన్యమని తెదేపా కదిరి ఇంఛార్జ్​ కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో ప్రభుత్వ విధానాలపై ఆయన మండిపడ్డారు.

Tdp Kadiri Incharge Venkata Prasad
తెదేపా కదిరి ఇంచార్జ్​ వెంకట ప్రసాద్​
author img

By

Published : May 24, 2020, 2:25 PM IST

సంవత్సర కాలంలో వైకాపా ప్రభుత్వం అవినీతి, కక్ష సాధింపు చర్యలు మినహా అభివృద్దిపరంగా చేసిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ అనంతపురం జిల్లా కదిరిలో అన్నారు. ఏడాదిలో ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతూ న్యాయస్థానాలు 50 సార్లు అక్షింతలు వేశాయని దుయ్యబట్టారు.

రక్షణ సామగ్రి లేవన్న వైద్యుడిపై కక్ష సాధింపు చర్యలపై, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడాన్ని న్యాయస్థానం తప్పు పట్టినందుకు వైకాపా నేతలు సంబరాలు చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ అధికార పార్టీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నందుకు సంబరాలు చేసుకుంటున్నా అని వెంకటప్రసాద్ విమర్శించారు.

ఇవీ చూడండి...

తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆందోళనకు గురవుతున్నారు: ఆదినారాయణ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.