అనంతపురంలో...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బడుగు వర్గాల అభివృద్ధికి పునాది పడిందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా తెదేపా కార్యాలయంలో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రాభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కదిరిలో...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కదిరిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పార్టీని స్థాపించిన ఎన్టీఆర్.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట్ల వెంకటప్రసాద్ అన్నారు.
హిందూపురంలో...
హిందూపురం ఎన్టీఆర్ కూడలిలో తెదేపా శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ అని నేతలు, కార్యకర్తలు అన్నారు.
కళ్యాణదుర్గంలో...
తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపితమైందని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు అన్నారు. స్థానిక ఎన్టీఆర్ భవన్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కొనసాగుతున్న పార్టీ అభిమానులను స్మరించుకున్నారు.
ఇదీచదవండి.