అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నమట్లగొంది గ్రామానికి చెందిన ఓ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి యత్నించాడు. అత్యాచారయత్నానికి గురైన బాలిక కుటుంబాన్ని తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పరామర్శించారు. పార్టీ తరుపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించాల్సిన వాలంటీర్లే.. ఆ ప్రజలపైనే తిరగబడుతున్నారని ఎంఎస్ రాజు ఆరోపించారు. ఇంత ఘోర ఘటన జరిగినా... బాధితులను ఎమ్మెల్యే పరామర్శించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. వాలంటీర్‌పై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం : మైనర్‌పై గ్రామ వాలంటీర్ అత్యాచారయత్నం