దొంగ ఓట్లు వేసేందుకు వైకాపా నాయకులు కుట్ర పన్నారని...అనంతపురం 22వ వార్డు తెదేపా అభ్యర్థి అనురాధ ఆరోపించారు. పార్టీ శ్రేణులతో కలిసి రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం ఏజెంట్లకు ఇచ్చిన ఓటర్ జాబితాలో 70 మంది గుర్తు తెలియని, ఫొటోల్లేని వ్యక్తులను చేర్చి వైకాపా నాయకులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వైకాపా నాయకులకు వంతపాడుతూ తమపై లాఠీఛార్జి చేశారని చెప్పారు. ఆందోళన చేపట్టిన తెలుగుదేశం నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో..పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదీచదవండి: వైవీ ఆంజనేయులు కారు అద్దాలను ధ్వంసం చేసిన వైకాపా శ్రేణులు