ETV Bharat / state

TDP Bus Yatra: విజయవంతంగా దూసుకుపోతున్న టీడీపీ బస్సు యాత్ర.. భారీగా తరలివస్తున్న ప్రజలు

TDP Bus Yatra: టీడీపీ చేపట్టిన బస్సు యాత్రకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కార్యకర్తలతో కలిసి వివిధ నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ చేపట్టిన బస్సు యాత్ర ప్రతి నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతోంది.

TDP Bus Yatra
టీడీపీ బస్సు యాత్ర
author img

By

Published : Jun 26, 2023, 9:35 PM IST

TDP Bus Yatra: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ బస్సు యాత్ర ప్రారంభమైంది. కొండలు, గుట్టలు యథేచ్ఛగా తవ్వేస్తుంటే.. ప్రభుత్వం మట్టి మాఫియాను అడ్డుకోలేకపోతోందని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన టీడీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి పరిటాల సునీత బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు.

రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో గుట్టలను తవ్వేసి అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న.. మట్టి మాఫియా ఆగడాలను టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. జిల్లా కలెక్టర్​కు, పోలీసులకు అక్రమ మట్టి తవ్వకాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. భారీ యంత్రాలతో కొండ గుట్టలను తవ్వేస్తుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోదా అని ఆమె ప్రశ్నించారు.

నెల్లూరు జిల్లాలో భారీ ర్యాలీ: నెల్లూరు జిల్లా కందుకూరుకు టీడీపీ నిర్వహిస్తున్న చైతన్య రథయాత్ర చేరుకుంది. భవిష్యత్​కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీతో టీడీపీ శ్రేణులు కందుకూరు నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఇందులో టీడీపీ నాయకులు, శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

పల్నాడు జిల్లాలో టీడీపీ బస్సు యాత్ర: భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర కార్యక్రమం పల్నాడు జిల్లాలో ప్రారంభమైంది. నేడు నరసరావుపేట నియోజకవర్గం కాకాని జేఎన్టీయూ నుంచి కోటప్పకొండ, యలమంద, నరసరావుపేట, ములకలూరు వరకూ బస్సు యాత్ర కొనసాగింది. పల్నాడు జిల్లాలో ఐదు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర జరగనుంది.

మొదటగా జేఎన్టీయూ వద్ద సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. అనంతరం పెట్లూరివారిపాలెం వద్ద వైసీపీ నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు. అదేవిధంగా టీడీపీ హయాంలో నిర్మించిన డిడ్కో ఇల్లును వైసీపీ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయకపోవడాన్ని విమర్శించారు. గడచిన నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నరసరావుపేట మండలం కాకాని వద్ద ప్రారంభమైన బస్సు యాత్ర కార్యక్రమంలో టీడీపీ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

బస్సు యాత్రను విజయవంతం చేద్దాం: జూన్ 27వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ తలపెడుతున్న బస్సు యాత్రను విజయవంతం చేయాలని కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్​లో టీడీపీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.