ETV Bharat / state

protest in kadiri 'రాష్ట్రంలో బీసీల మనుగడకు ప్రమాదం' - protest in kadiri on lockup death in pulivendula

పులివెందులలో లాకప్ డెత్​కు గురైన అశోక్ మృతిపై విచారణ జరిపించాలని అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా బీసీ సెల్ నేతలు ఆందోళన చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని ఆక్షేపించారు. రాష్ట్రంలో బీసీల మనుగడకు ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కదిరిలో ఆందోళన
కదిరిలో ఆందోళన
author img

By

Published : Aug 14, 2021, 3:43 PM IST

Updated : Aug 14, 2021, 6:48 PM IST

రాష్ట్రంలో బీసీల దమనకాండను ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సహిస్తున్నారని తెదేపా బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. పులివెందులలో లాకప్ డెత్​కు గురైన అశోక్ మృతిపై విచారణ జరపించాలని కోరుతూ అనంతపురం జిల్లా కదిరిలో.. నిరసన చేసేందుకు వెళ్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయాల్లో హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు చేస్తూ ప్రజా స్వేచ్ఛకు, రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.

జైలులో ఒక వ్యక్తి చనిపోతే ఎందుకు చనిపోయాడో తెలపలేని స్థితిలో ప్రభుత్వ పాలన సాగుతోందని నిరసనకారులు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీల మనుగడకు ప్రమాదం ఏర్పడిందన్న చంద్రశేఖర్.. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు అండగా ఉంటామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

CM JAGAN IN MARRIGE CEREMONY: వివాహ వేడుకలో జగన్.. నూతన వధూవరులకు ఆశీర్వాదం

Last Updated : Aug 14, 2021, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.