ETV Bharat / state

'మైనారిటీ యువతి హత్య కేసుపై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు' - చాపిరి మైనారిటీ యువతి హత్య కేసు

అనంతపురం జిల్లా చాపిరిలో మైనారిటీ యువతి హత్య కేసుపై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్ మండిపడ్డారు. నిందితులపై దిశా కేసును నమోదు చేసి.. బాధిత కుటుంబానికి రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని తెదేపా ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు.

tdp and minority leaders Outraged on police of chapiri girl murder case
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నేతలు
author img

By

Published : Nov 29, 2020, 7:52 PM IST

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో ఇటీవల ఓ యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడి హత్య చేశాడు. బాధిత యువతి కుటుంబాన్ని నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వర నాయుడు, రాష్ట్ర మైనార్టీ నాయకులు పరామర్శించారు. ఈ ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడ్డారు. హత్యకు గురైన యువతిని శారీరకంగా హింసించి హత్య చేస్తే పోలీసులు సాధారణ హత్యగా చిత్రీకరిస్తున్నారని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్ అన్నారు. పోలీసులు నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నామని ఇప్పటికైనా ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. మైనారిటీ యువతి హత్యకు సహకరించిన వారందరిపై దిశా కేసు నమోదు చేసి.. 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసుల పై నమ్మకం లేదని ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి. ప్రియుడి చేతిలో హత్యకు గురైన యువతి.. కుటుంబసభ్యుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.