భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని అనంతపురం జిల్లా శింగనమల మండలం కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద తెలుగుదేశం, సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులకు పంట నష్టపరిహారం కోరుతూ అంబేద్కర్ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రైతులందరికీ వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం రైతుల ఖాతాలోకి జమ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేస్తే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం రైతుల పక్షపాతి అని గొప్పలు చెప్పుకోవడం తప్పా.. వారికి ఏమాత్రం మేలుచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు మోసానికి గురవుతున్నారని నాయకులు మండిపడ్డారు.
ఇదీ చదవండి: 'నష్టపోయిన రైతులందరికీ పెట్టుబడి రాయితీ చెల్లించాలి'