రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగేందుకు ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెదేపా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు అన్నారు. రాజధాని ఉద్యమం 250 రోజులకు చేరుకున్న క్రమంలో పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
రాజధాని రైతులకు అండగా తెదేపా పోరాటం కొనసాగుతుందని ఉమామహేశ్వర నాయుడు స్పష్టం చేశారు. అమరావతి విషయంతో సీఎం జగన్ మొండి వైఖరి వీడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని 5 కోట్ల ఆంధ్రుల కలలను కాపాడాలని కోరారు.
ఇవీ చదవండి...