ETV Bharat / state

పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు.. లోకేశ్​కు తాడిపత్రి డీఎస్పీ నోటీసులు

Notices To Nara Lokesh In YuvaGalam Padayatra : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. తాడిపత్రిలో యువగళం పాదయాత్రలో లోకేశ్​కు డీఎస్పీ చైతన్య నోటీసులు ఇచ్చారు.

Notices To Nara Lokesh In YuvaGalam Padayatra

author img

By

Published : Apr 11, 2023, 12:17 PM IST

Notices To Nara Lokesh In YuvaGalam Padayatra : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర 67వ రోజు కొనసాగుతోంది. అయితే యువగళం పాదయాత్రలో లోకేశ్‌కు తాడిపత్రి డీఎస్పీ చైతన్య నోటీసులు ఇచ్చారు. తాడిపత్రి.. ఫ్యాక్షన్ నియోజకవర్గం కావడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ముందస్తుగా నోటీసులు ఇచ్చారు. అయితే తానెక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయట్లేదని డీఎస్పీకి లోకేశ్​ స్పష్టం చేశారు. ప్రభుత్వ అవినీతిని కచ్చితంగా ఎండగడతానని డీఎస్పీకి తేల్చిచెప్పారు. నోటీసులు తీసుకోవాలని లోకేశ్‌ను డీఎస్పీ కోరగా.. అందుకు లోకేశ్​ నిరాకరించారు. లోకేశ్​ నోటీసులు తీసుకోకపోవడంతో పాదయాత్ర నిర్వాహకులకు ఇచ్చి డీఎస్పీ చైతన్య అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను యువనేత అడిగి తెలుసుకుంటున్నారు. దారి పొడువునా పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. పాదయాత్రలో భాగంగా 67వ రోజు ఉలికుంట్లపల్లి విడిది కేంద్రం నుంచి లోకేశ్ నడక ప్రారంభించారు. పెద్దపప్పూరు మండలం సింగనగుట్టపల్లిలో.. లోకేశ్​కు J.C. దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు స్వాగతం పలికారు. లోకేశ్​తో కలిసి పాదం కదిపారు. తాడిపత్రి నియోజకవర్గంలో మత్స్యకారులు, రజకులు, చేనేతలు, బుడగజంగాలతో యువనేత భేటీ కానున్నారు. సింగనగుట్టపల్లికి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ఉలికంటిపల్లి విడిది కేంద్రం వద్ద జ్యోతిరావు పూలే చిత్రపటానికి లోకేశ్‌ నివాళులర్పించారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.