అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తమ కౌన్సిలర్లతో క్యాంపు ఏర్పాటు చేశారు. కౌన్సిల్ సమావేశం జరిగే సమయానికి వారందరినీ తీసుకుని అక్కడికి వచ్చారు. తెలుగుదేశానికి ఆధిక్యం ఉండటంతో వైకాపా ఈ సమావేశాన్ని బహిష్కరించింది. దీంతో తెదేపా బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి రెండో వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
అధికార పార్టీ సభ్యులు కౌన్సిల్‌ను బహిష్కరించటం ఆ పార్టీ కౌన్సిలర్లను అవమానించినట్లేనని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే.. సమావేశానికి రాకుండా ముఖం చాటేశారని విమర్శించారు.
ఇదీ చదవండి: RUIA CASE: భార్యపై అనుమానంతో హత్య.. కరోనా మృతిగా చిత్రీకరణకు యత్నం