ETV Bharat / state

లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఎస్పీ - లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరారు.

లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

author img

By

Published : Apr 9, 2020, 7:56 AM IST

అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న లాక్​డౌన్​పై జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు క్షేత్రస్థాయిలో సమీక్షించారు. గుత్తి మండల శివారులోని జాతీయ రహదారిపై ఉన్న చెక్​పోస్టులను పరిశీలించారు. లాక్​డౌన్ నేపథ్యంలో జిల్లాల సరిహద్దులు మూసేశామని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఎవరిని సరిహద్దులు దాటడానికి అనుమతించమన్నారు. లాక్​డౌన్ అతిక్రమించిన వాహన యజమానులు, దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ..వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరారు.

ఇదీచదవండి

లాక్​డౌన్​: 'కరోనా కాలం'.. గట్టెక్కాలంటే ఇంట్లోనే సురక్షితం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.