గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా ఫలితాలను ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం రాచువారిపల్లికి చెందిన మాదిగ గంగాద్రి... పట్టు పరిశ్రమ శాఖ పరీక్షలో రాష్ట్రస్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచాడు. 150 మార్కులకు గాను 114 మార్కులు సాధించాడు. ఎస్. కె.యూనివర్సిటీలో ఎంఎస్సీ సెరీకల్చర్ పూర్తి చేశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన... మొదటి నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువు అభ్యసించాడు. అనంతపురంలో స్నేహితుడి వద్ద ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమై విజయం సాధించాడు.
ఇదీ చూడండి: 'గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్'