ETV Bharat / state

స్టాఫ్ నర్సు దయనీయ పరిస్థితిపై ఈటీవీ కథనానికి స్పందన

గుంతకల్లుకు చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సు దయనీయ పరిస్థితిపై ఈటీవీ ప్రసారం చేసిన కథనానికి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు స్పందించారు. కరోనాతో ఊపిరి తీసుకోలేని సమస్యతో ప్రభుత్వ స్టాఫ్ నర్సు బాధపడుతుండగా ఆమెకు అస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు.

స్టాఫ్ నర్సు దయనీయ పరిస్థితిపై  ఈటీవీ కథనానికి స్పందన
స్టాఫ్ నర్సు దయనీయ పరిస్థితిపై ఈటీవీ కథనానికి స్పందన
author img

By

Published : Aug 4, 2020, 4:09 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన స్టాఫ్ నర్సు కరోనా బారిన పడ్డారు. ఆమె భర్త, కుమారునికి కరోనా సోకింది. భర్త, కుమారుడిని అనంతపురం ఆస్పత్రికి తరలించగా నర్స్​ను ఎస్కేయూ కొవిడ్ సెంటర్​కు వెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్లాక అమెకు శ్వాస తీసుకోవటం సమస్యగా మారింది. ఎస్కేయూలో ఆక్సిజన్ బెడ్​ లేకపోవటంతో, హిందూపురం వెళ్లాలని అక్కడి వైద్యులు సిఫార్సు చేశారు. అయితే ఆమెను హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లే వాహనంలో అక్సిజన్ సౌకర్యం లేకపోవటంతో, ఆమె భర్త ఆ వాహనంలో తరలించడానికి భయపడ్డారు.

ఈ లోపు ఆమెకు సమస్య తీవ్రమైంది. దీంతో అక్కడే ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ ను సంప్రదించగా మూడు గంటల సేపు అంబులెన్స్​లో ఆక్సిజన్ అమర్చేలా, డ్రైవర్​కు ఏడు వేల రూపాయలు చెల్లించేలా మాట్లాడారు. ఈ విషయం ఈటీవీలో ప్రసారం కావటంతో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు స్పందించారు. వెంటనే ఆమెకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎస్కేయూ ఎదుట రోడ్డుపై ప్రైవేట్ అంబులెన్స్​లో ఉన్న స్టాఫ్ నర్సును 108 వాహనంలో అనంతపురం అస్పత్రికి తరలించారు. ప్రైవేట్ అంబులెన్స్ లో ఆక్సిజన్ అందించటం వల్ల ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడటంతో సెలైన్ ఎక్కిస్తూ, మందులతో చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనా సోకి సీపీఎం నేత సున్నం రాజయ్య మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.