కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు - కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
అనంతపురం జిల్లా కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు వసంత వల్లభుడు శేష వాహనంపై తిరువీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. యాగశాల నుంచి ఉత్సవమూర్తులను అలంకార మండపానికి తీసుకొచ్చి..వివిధ రకాల పుష్పాలతో స్వామి వారిని అలంకరించారు. శ్రీవారిని ప్రత్యేక పల్లకిపై రాజగోపురం ముందుకు తీసుకొ చ్చారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు