ETV Bharat / state

పోలీసులు... కరోనా ధీరులు! - పోలీసులపై కొవిడ్ ప్రభావం

కరోనా.. సాధారణ జలుబు కంటే కొంత తీవ్రమైన వ్యాధి. వైరస్‌ సోకినా ఎలాంటి ఆందోళనకు గురికావద్ధు. భయపడితే ప్రాణం మీదకు తెచ్చుకున్నట్టే. మనో ధైర్యంతో ఉంటే ఇంటిలోనే జర్వంలా నయం చేసుకోవచ్ఛు. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ.. మందులు వాడితే సులువుగా జయించవచ్చు’.. అని కొవిడ్‌ను ఎదుర్కొన్న పోలీసు అధికారులు చెబుతున్నారు. నిత్యం విధుల్లో ఉంటూ.. ప్రజలతో మమేకమైన ఎందరో పోలీసులు వైరస్‌ బారిన పడ్డారు. వారంతా ధైర్యంగా ఎదుర్కొని, తిరిగి విధుల్లో చేరారు. కుటుంబ సభ్యుల తోడ్పాటు, వైద్యుల సూచనలు, సలహాలతో కోలుకున్నట్లు తెలిపారు.

covid influence on the police department
పోలీసు శాఖపై కొవిడ్ ప్రభావం
author img

By

Published : May 23, 2021, 11:51 AM IST

విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు కొవిడ్ బారినపడుతున్నారు. వారంతా ఈ మహమ్మారితో విజయవంతంగా పోరాడి తిరిగి తమ విధులు నిర్వర్తిస్తున్నారు.

అనంతపురం జిల్లాలో పోలీసుల సంఖ్య: 4,200

రెండో దశ కొవిడ్‌ బాధితులు: 644

కోలుకున్న వారు: 500

చికిత్స పొందుతున్న వారు: 59

ప్రారంభ దశలోనే గుర్తిస్తే..

కరోనా సోకినప్పుడు ప్రారంభ దశలోనే తెలుసుకుంటే సులువుగా ఇంటి వద్ద ఉంటూ నయం చేసుకోవచ్ఛు. ఎలాంటి భయానికి గురి కావాల్సిన అవసరం లేదు. వైరస్‌ సోకిందని తెలియగానే భయమేస్తుంది. కానీ వ్యాధి లక్షణాలు, తీవ్రతను బట్టి కోలుకోగలమనే ధైర్యాన్ని నింపుకోవాలి. విధి నిర్వహణలో బయట తిరగడంతో నాకు వైరస్‌ సోకింది. కానీ లక్షణాలు కనిపించలేదు. మా ఇంటిలో చిన్నారికి జర్వం రావడంతో అనుమానం వచ్చి పరీక్ష చేయించాను. పాజిటివ్‌ అని తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులందరూ పరీక్షలు చేయించుకోగా.. నాకు పాజిటివ్‌ వచ్చింది. ప్రారంభ దశలోనే ఉందని తెలుసుకొని హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటూ వైద్యుడి సలహా మేరకు మందులు తీసుకున్నాం. మందులు తీసుకుంటుండగానే నాలుగో రోజు రుచి, వాసన పోయాయి. అయినా ధైర్యం కోల్పోలేదు. ఆసుపత్రికి వెళ్లకుండానే కోలుకున్నాం. ఎవరికైనా అనుమానం కలిగితే నేరుగా కరోనా పరీక్షలు చేయించుకోవడం మంచిది. రోజూ 5 లీటర్ల నీటిని తాగాలి.. ఆవిరి పట్టుకోవాలి. - శేఖర్‌, సీఐ, కొవిడ్‌ ప్రత్యేక విభాగం

వైద్యుల సలహాలు పాటించా..

బాధితులు ముఖ్యంగా మనోధైర్యంతో ఉండాలి. వైరస్‌ సోకిందని తెలియగానే మానసికంగా కుంగిపోవద్ధు గుండె నిబ్బరం చేసుకుని చికిత్స గురించి ఆలోచించాలి. అనుమానం రావడంతో నేను కరోనా పరీక్ష చేయించుకున్నా. అందులో పాజిటివ్‌ వచ్చింది. తొలుత ఐదు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందాను. వైద్యులు ఆక్సిజన్‌ స్థాయి, బీపీ, షుగర్‌ను తరచూ పర్యవేక్షించారు. ఐదు రోజుల్లో వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టింది. మరో 10 రోజులపాటు ఇంటిలోనే ఉంటూ వైద్యుడి సలహాల మేరకు మందులు తీసుకున్నాను. గొంతును రోజూ రెండు పర్యాయాలు ద్రావకంతో పుక్కిలించడం చేశా. పౌష్టికాహారం తీసుకున్నా. క్రమం తప్పకుండా మాత్రలు వాడాను. ధైర్యంతోనే మహమ్మారిని జయించా. - మురళీధర్‌రెడ్డి, సీఐ, అనంత గ్రామీణం

యోగా, ప్రాణాయామం

వైరస్‌ సోకిందన్న విషయం మరిచిపోతే త్వరగా నయమవుతుంది. నాకు పొడి దగ్గు ఉండటంతో పరీక్ష చేయించా. పాజిటివ్‌ అని తెలిసింది. అప్పట్నుంచి ఇంట్లోనే ఉంటూ వైద్యుల సలహా మేరకు మందులు తీసుకున్నాను. నా భార్య కూడా నన్ను చూసి దూరంగా ఉండకుండా ఆదరిస్తూ వేళకు మందులు, భోజనం, పళ్ల రసాలు ఇచ్చారు. ఎస్పీ కార్యాలయం నుంచి అధికారులు తరచూ ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సలహాలు ఇచ్చారు. ఉదయం, సాయంత్రం రెండుపూటలా ద్రావకంతో గొంతు పుక్కిలించాను. నిద్ర లేవగానే గంటపాటు ప్రాణాయామం, యోగా చే స్తూ.. శ్వాస ప్రక్రియను సాధారణ స్థితికి తెచ్చుకున్నా. బాధితులు ధైర్యంగా ఉండండి. - రమేష్‌, ఏఎస్సై, అనంత 1వ పట్టణం

వైరస్‌ దరిచేరనీయొద్దు

ప్రతి ఒక్కరూ వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భౌతిక దూరం పాటించడం, రెండు మాస్కులు ధరించడం చేయాలి. నాకు కొద్దిపాటి జ్వరం అనిపిస్తేనే పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్‌ అని తెలియగానే ఇంటిలో ఐసొలేషన్‌లో ఉన్నా. నా నుంచి ఇతరులకు సోకకుండా చూసుకున్నా. ఇంటిలోనే వైద్యుడి సలహాల మేరకు మందులు వేసుకున్నాను. నాలుగు రోజులపాటు వ్యాధి తీవ్రత అధికంగా ఉంది. మనోధైర్యంతో ఆ నాలుగు రోజులు గడిపా. తర్వాత తగ్గుతూ వచ్చింది. ప్రారంభ దశలోనే గుర్తించడంతో సులువుగా నయమైంది. కరోనా వచ్చిందని మొబైల్‌కు సంక్షిప్త సమాచారం రాగానే రోగుల్లో భయం పట్టుకుంటుంది. అదే రోగం తీవ్రతను పెంచుతుంది. ఎవరూ భయపడాల్సిన పని లేదు. సాధారణ జబ్బులాగానే అనుకుంటే ఇంటిలోనే నయమవుతుంది. ఒక వేళ ఆసుపత్రికి వెళితే అక్కడి వాతావరణానికి అలవాటు పడాలి. - నబీరసూల్‌, ఎస్సై, అనంత గ్రామీణం

ఇదీ చదవండి:

'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు.. నాటు మందు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.