రైల్వేలైన్ వేగం పెంచే క్రమంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేణిగుంట-గుత్తి మార్గంలో గుంతకల్లు డీఆర్ ఎం అలోక్ తివారి ఆధ్వర్యంలో ఆర్డీఎస్వో టీం కోర్ విజయవంతంగా నిర్వహించారు. రేణిగుంట నుంచి గుత్తికి 280కిలీమీటర్ల దూరంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా గంటకు 130 కి.మీ వేగంతో 30 నిమిషాలు పాటు విజయవంతంగా నిర్వహించారు.
ఈ మార్గంలో రైళ్ల వేగం పెంచడం కోసం మొత్తం 70 కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిడ్జ్ ల ఆధునీకరణ, ట్రాక్ పటిష్టం లెవెల్ క్రాసింగ్ గేట్స్ లేకుండా తప్పించటం,34 స్టేషన్ల పరిధిలో డబుల్ డిస్టెన్స్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయటం వంటి అనేక పనులు పూర్తిచేసి ఈ వేగం పెంచే ట్రయిల్ రన్ పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ట్రయిల్ రన్ మొత్తం నివేదిక ను రైల్వే సేఫ్టీ కమిషన్ కు నివేదించి అనుమతి వచ్చిన తర్వాత ముఖ్యమైన రైళ్ల వేగం పెంచనున్నట్టు గుంతకల్ దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ డీఆర్వో అలోక్ తివారి వెల్లడించారు. అలాగే గుత్తి-వాడి సెక్షన్ల మధ్య ఇదే తరహా పనులు వేగంగా జరుగుతున్నాయని ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అయ్యే లోపు 257 కి.మీ మార్గంలో రైళ్ల వేగం పెంచే పనులన్నీ పూర్తిచేసి ట్రయిల్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి