గ్రహణ ప్రభావంతో విజయనగరం జిల్లాలో ప్రధాన కూడళ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. రైల్వే స్టేషన్, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. దేవాలయాలు మూతపడ్డాయి. గ్రహణ సమయంలో జనం బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు.
అనంతపురం జిల్లా ధర్మవరంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సూర్య గ్రహణ వీక్షణ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆర్టీవో మధుసూదన్ ప్రారంభించారు. పట్టణ ప్రజలు, విద్యార్థులు సోలార్ ఫిల్టర్ల సహాయంతో సూర్యగ్రహణాన్ని వీక్షించారు. మూఢనమ్మకాలు వదిలి సూర్యగ్రహణాన్ని చూడాలని ఆర్టీవో సూచించారు.
విశాఖ జిల్లాలో గ్రహణం ప్రభావం కనిపించింది. చోడవరంలో సూర్య గ్రహణంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారులన్ని నిర్మానుష్యంగా కనిపించాయి. దేవాలయాలకు తాళాలు వేశారు.
ఇదీ చదవండి