కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆపన్నులకు నేనున్నానంటూ సహాయ సహకారాలు అందిస్తున్నాడు నటుడు సోనుసూద్. ఆయన సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన పలువురు యువకులు.. సోనూసూద్ పేరుపై అసోసియేషన్లు, అభిమాన సంఘాలు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోనూ పలువురు 'సోనూసూద్ అసోసియేషన్' పేరు మీద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై శేషగిరి పాల్గొని యువతను అభినందించారు.
ఇదీ చదవండి..: ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుపై.. సోనూసూద్ ఫ్లెక్సీకి పాలాభిషేకం