ETV Bharat / state

తమను పట్టించుకోవడం లేదని...ఆ కుమారుడు ఏం చేశాడంటే..!

author img

By

Published : Oct 5, 2021, 5:31 PM IST

Updated : Oct 5, 2021, 7:03 PM IST

తండ్రి వేరే మహిళతో సన్నిహితంగా ఉంటూ తమను పట్టించుకోవడం లేదని కుమారుడు కోపం పెంచుకున్నాడు. ఆర్థికంగా సహాయం చేయడం లేదనే ఆగ్రహంతో కన్నతండ్రినే హతమార్చాడు. అనంతరం తానే హత్య చేశానని పోలీసులకు లొంగిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

SON MURDERED FATHER
SON MURDERED FATHER

అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కన్నతండ్రిని చంపి..(SON MURDERED FATHER IN ANANTAPUR).. మృతదేహాన్ని కాలువలో పడేశాడు కుమారుడు. నారాయణపురం పరిధిలోని ఇందిరమ్మకాలనీలో వద్దే నగేష్​(50) అనే వ్యక్తి డ్రైవర్​గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి కుమారుడు నాగరాజుతో పాటు ఒక కుమార్తె ఉంది. నగేశ్ భార్య పదేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో నగేష్ మరో మహిళతో చనువుగా ఉంటుండడంతో కుమారుడు నాగరాజు నిత్యం గొడవపడే వాడని స్థానికులు తెలిపారు.

డ్రైవర్​గా పని చేసి, వచ్చిన డబ్బులను కుటుంబం కోసం వెచ్చించకుండా.. మరో మహిళకు ఇస్తున్నాడనే కక్షతో సోమవారం రాత్రి తండ్రి తలపై నాగరాజు ఇనుప రాడ్డుతో కొట్టి హతమార్చాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా కాలనీకి దగ్గరలోని కాలువలో పడేశాడు. పశ్చాత్తాపానికి గురైన నాగరాజు.. తండ్రిని తానే హత్య చేశానని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు. తాను డిగ్రీ పూర్తి చేసి బీఈడీ చదువుతున్నానని.. చదువులకు తన తండ్రి ఆర్థిక సహాయం చేయకపోవడం, మరో మహిళతో చనువుగా ఉండటం జీర్ణించుకోలేక హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

NREGS Bills: నాలుగు వారాల్లోగా ఉపాధి పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి: హైకోర్టు

Last Updated : Oct 5, 2021, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.