వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేస్తు నిర్వహిస్తున్న బస్సు యాత్ర.. సామాజిక నయవంచన యాత్ర అంటూ సామాజిక హక్కుల వేదిక నేతలు విమర్శలు చేశారు. రాష్ట్ర మంత్రులు నిర్వహిస్తున్న బస్సు యాత్రకు వ్యతిరేకంగా అనంతపురంలో సామాజిక హక్కుల వేదిక నేతలు అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్సీ వర్గానికి చెందిన డ్రైవర్ ను హత్యచేస్తే, ఆ వర్గాల్లో వ్యతిరేకత వచ్చిందని ప్రభుత్వం మంత్రులతో బస్సు యాత్ర చేయిస్తోందని విమర్శించారు. సీఎం జగన్ కు సామాజిక బాధ్యత ఏమాత్రం లేదని అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం అనంతపురానికి వస్తున్న మంత్రుల బస్సు యాత్రను.. సామాజిక హక్కుల వేదిక వ్యతిరేకిస్తోందని చెప్పారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టి, ఘర్షణలు చేయించింది వైకాపా నాయకులేనని అన్నారు.
'వైకాపా చేస్తుంది బస్సు యాత్ర కాదు.. సామాజిక నయవంచన యాత్ర' - వైకాపా బస్సు యాత్రపై విమర్శలు చేసిన సామాజిక హక్కుల వేదిక నేతలు
వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేస్తు నిర్వహిస్తున్న బస్సు యాత్ర.. సామాజిక నయవంచన యాత్ర అంటూ సామాజిక హక్కుల వేదిక నేతలు విమర్శించారు. సీఎం జగన్ కు సామాజిక బాధ్యత ఏమాత్రం లేదని అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేస్తు నిర్వహిస్తున్న బస్సు యాత్ర.. సామాజిక నయవంచన యాత్ర అంటూ సామాజిక హక్కుల వేదిక నేతలు విమర్శలు చేశారు. రాష్ట్ర మంత్రులు నిర్వహిస్తున్న బస్సు యాత్రకు వ్యతిరేకంగా అనంతపురంలో సామాజిక హక్కుల వేదిక నేతలు అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్సీ వర్గానికి చెందిన డ్రైవర్ ను హత్యచేస్తే, ఆ వర్గాల్లో వ్యతిరేకత వచ్చిందని ప్రభుత్వం మంత్రులతో బస్సు యాత్ర చేయిస్తోందని విమర్శించారు. సీఎం జగన్ కు సామాజిక బాధ్యత ఏమాత్రం లేదని అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం అనంతపురానికి వస్తున్న మంత్రుల బస్సు యాత్రను.. సామాజిక హక్కుల వేదిక వ్యతిరేకిస్తోందని చెప్పారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టి, ఘర్షణలు చేయించింది వైకాపా నాయకులేనని అన్నారు.
TAGGED:
ap latest news