అనంతపురం జిల్లా కదిరిలో జాతీయ రహదారిపై ఉన్న ఒక మద్యం దుకాణం వద్ద పెద్ద సంఖ్యలో మద్యం ప్రియులు బారులు తీరారు. భౌతికదూరం పాటించకుండా, మాస్కులు సైతం ధరించకుండా వరసలో నిలుచున్నారు. ఒకరిమీద ఒకరు పోటీపడుతూ మద్యం కోసం ఎగబడుతున్నారు. మద్యం దుకాణాదారులు కానీ, అధికారులు గానీ కనీస జాగ్రత్తలు తీసుకునేలా వారిని హెచ్చరించకపోవడం గమనార్హం.
ఇది చదవండి గిరిజన వర్సిటీ ప్రవేశాలకు ప్రకటన..