అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రైల్వే పాఠశాలలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పరిశీలించారు. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, రైల్వే డీఆర్ఎంతో కలసి సెంటర్‌ను తనిఖీ చేశారు. నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. తర్ఫీదు పొందిన ప్రతి మహిళకూ ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి మండలంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం రైల్వే డీఆర్ఎం విజయప్రతాప్ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమై... గుంతకల్లు డివిజన్ అభివృద్ధిపై చర్చించారు. రైల్వే కార్యక్రమాలపై , ప్రయాణికుల భద్రతపై మంత్రి ఆరా తీశారు
'ప్రతి మండలంలోనూ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు'
ప్రతి మండలంలోనూ స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లు(నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు)ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. గుంతకల్లులోని ఓ శిక్షణా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.