అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్టురు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపైకి ఓ ద్విచక్రవాహనం దూసుకెళ్లటంతో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిద్దరిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా...చిన్నారులిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా మెగానాథ్ (6) అనే బాలుడు మార్గ మధ్యలో చనిపోయాడు. మనోజ్ అనే మరో బాలుడిని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు చేర్చుకోడానికి నిరాకరించారు. నాలుగైదు ఆసుపత్రులు తిరిగిన వెనక్కు పంపడంతో పట్టణంలోనే చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితులో ఉన్న చిన్నారిని ఆసుపత్రిలో చేర్చుకోకపోవడంపై బాలుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: