ఓ శుభకార్యానికి వచ్చిన వ్యక్తులు అదే గ్రామంలో ఉన్న వన్నూరు స్వామి అనే వ్యక్తిపై దాడి చేశారు. ఈ ఘర్షణ ఉరవకొండ మండలం ఆమిద్యాలలో జరిగింది. మద్యం మత్తులో ద్విచక్రవాహనాలపై వస్తున్న వ్యక్తులు మన్నూరు స్వామి వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం జరిగిన గొడవలో వీరు ఘర్షణ పడ్డారు. కర్రలతో మన్నూరు స్వామి తలపై గాయపరిచారు. బాధితుడిని గ్రామస్థులు వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరినిపై కేసు నమోదు చేశారు. కరోనా సమయంలో ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ధరణి బాబు హెచ్చరించారు.
ఇదీ చదవండి :