అనంతపురం జిల్లా పామిడి పట్టణ కేంద్రంగా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. పామిడి పట్టణ సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ... పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని పక్కా సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు చేశామన్నారు. క్రికెట్ బెట్టింగ్ కు పాలుపడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి రూ.4900, నగదుతో పాటు 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు.
ఇదీ చదవండీ...