అత్యవసర సర్వీసులు 108, 104 అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడని... ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ వ్యక్తి అనారోగ్యం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 108, 104 సిబ్బందికి తెలియజేసినా స్పందించని కారణంగా... స్థానిక ఎస్సై ధరణి బాబు స్పందించి ప్రైవేటు అంబులెన్స్ పంపించారు.
అప్పటికే పరిస్థితి విషమించిన కారణంగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చివరికి అదే ఎస్సై దగ్గరుండి అంత్యక్రియలను నిర్వహించారు. ఎస్సై దాతృత్వానికి బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. 104. 108 సిబ్బంది సమయానికి స్పందించి ఉంటే.. తన భర్త బతికి ఉండేవాడని బాధిత మహిళ చెప్పింది.
ఇదీ చదవండి:
కరోనా రోగుల అంబులెన్స్... ఎంతమంది ఎక్కడానికైనా ఉంది లైసెన్స్