అనంతపురం జిల్లా కదిరిలో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలను నేతలు కొనియాడారు. ప్రపంచ దేశాల్లో భారత్ ను అగ్రస్థానంలో నిలపాలని కాంక్షించిన వారిలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ మొదటి వారన్నారు. ఆయన దేశానికి అందించిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు.కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల చూసి...వివిధ పార్టీలకు చెందిన నాయకులు భాజపా వైపు చూస్తున్నారని ఆ పార్టీ నాయకులు అన్నారు.
ఇవీ చదవండి...కర్నాటకం: విదేశాల్లో అగ్రనేతలు... రాష్ట్రంలో చిక్కులు