అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలంలోని సౌర విద్యుత్ ప్రాజెక్టులో విద్యుదాఘాతం జరిగింది. ప్రాజెక్టులోని గమేషా కంపెనీకి చెందిన బ్లాక్ నెంబర్ 22లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇన్వర్టర్ ప్యానెల్లో మరమ్మతులు చేస్తుండగా విద్యుతాఘాతం చోటు చేసుకుందని సంస్థ అధికారులు తెలిపారు. మరమ్మతులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో నలుగురు ఇంజనీర్లకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన మిగతా సిబ్బంది గాయపడిన వారిని కడప జిల్లా గాలివీడు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇదీ చదవండి:
POWER WAR: ఇరురాష్ట్రాల మధ్య విద్యుత్ పంచాయితీగా మారిన జల వివాదం
RRR letter: 'నవ సూచనల' పేరుతో సీఎం జగన్కు రఘురామరాజు లేఖ