అనంతపురం జిల్లా గుత్తి మండలంలో.. ఆరేళ్ల బాలికపై 21 ఏళ్ల యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. బాలికను ఇంటి పక్కనే ఉన్న పొలంలోకి తీసుకెళ్లి.. లైంగిక దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న చిన్నారులు తల్లిదండ్రులకు తెలపడంతో.. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారిపై దాడి ఆనవాళ్లు ఉన్నాయని.. వైద్యులు నిర్ధరించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు.. పోలీసులు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో నిందితుడిని పట్టుకుంటామన్నారు.
ఇదీ చదవండి: Women Disrimination: రాకెట్ల కాలంలోనూ రాతికాలపు ఆచారాలే